కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో దేశమంతా స్థంభించింది. అందులో భాగంగా సినీ పరిశ్రమ కూడా నిలిచిపోయింది. దీంతో రోజువారి కూలీ పనులు చేసుకునే వారికి సినీ స్టార్స్ విరాళాలు ప్రకటిస్తూ అటు ప్రభుత్వానికి ఇటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌కు చెన్నై కార్పొరేషన్ తరపు నుంచి ఓ లేఖ వచ్చింది. అందులో ఆయన రాఘవేంద్ర కళ్యాణ మంటపం గురించి రాసారు వాళ్లు. కొన్ని రోజుల కింద చెన్నైలోని తన కళ్యాణ మంటపాన్ని కరోనా వైద్య సేవల కోసం వాడుకోవచ్చంటూ ప్రకటించాడు సూపర్ స్టార్. అవసరం ఉంటే దాన్ని వైద్యశాలగా మార్చేసి కావాల్సినన్ని రోజులు తీసుకోండని చెప్పాడు రజినీకాంత్. అయితే ఇప్పటి వరకు ఆ అవసరం అయితే రాలేదు. ఇక ఇప్పుడు చెన్నై కార్పోరేషన్ శాఖ నుంచి దీనికి సంబంధించి రజినీకాంత్‌కు స్పెషల్ లెటర్ ఒకటి వచ్చింది.ఇప్పటికే చెన్నైలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి, ఒమంతుర్, స్టాన్లీ ఆసుపత్రులు ప్రత్యేక వార్డులతో నిండిపోయాయి.. ఎందుకంటే చెన్నైలో రోజురోజుకీ కరోనా రోగులు పెరుగుతున్నారు. అందుకే చెన్నైలోని నందంబక్కం షాపింగ్ సెంటర్‌లో కూడా ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశారని కార్పోరేషన్ తెలిపింది. అంతేకాదు.. మద్రాస్ కార్పొరేషన్ తరపున 50 వేల పడకలను ఏర్పాటు చేయనున్నట్లు లేఖలో తెలిపారు వాళ్లు. స్కూల్స్, కాలేజ్‌లు, కళ్యాణ మంటపాలు కూడా వైద్య సేవల కోసం వాడుకుంటామని చెప్పారు కార్పోరేషన్ అధికారులు.ఇదే విషయంపై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ మాట్లాడుతూ.. అన్ని చెన్నైలోని కళ్యాణ మంటపాలకు నోటీసులు పంపినట్లు తెలిపాడు. చెన్నైలో మొత్తం 747 వివాహ మందిరాలు ఉన్నాయని.. అవన్నీ వాళ్ల నియంత్రణలోకి వస్తాయని చెప్పాడు ప్రకాశ్. జాతీయ విపత్తు చట్టం క్రింద తమకు ఆ అధికారం ఉందని చెప్పాడు కమీషనర్. అందులో భాగంగానే కోడంబాక్కంలోని రజనీకాంత్ రాఘవేంద్ర కళ్యాణ మంటపం కూడా సిద్ధంగా ఉంచాలంటూ లేఖ రాసారు. ఇదిలా ఉంటే తన కళ్యాణ మంటపాన్ని కరోనా చికిత్సకు ఉపయోగించవచ్చని ఇదివరకే రజనీకాంత్ కార్పొరేషన్ తరపున మద్రాస్ కార్పొరేషన్‌కు ఒక లేఖ రాసాడు.. ఇప్పుడు వాళ్లు వాడుకుంటామని తిరిగి లేఖ రాసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa