కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రాకుండా ఎలాంటీ జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తోంది సినీ నటి పూజా హెగ్డే. ఆమె మాట్లాడుతూ.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలనీ, బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలనీ సూచిస్తోంది. ఒకవేళా అత్యవసరంగా బయటకు వెళితే మాస్కులు ధరించాలనీ చెబుతోంది. అసలు ఈ వైరస్ భారిన పడకుండా ఉండాలంటే ఇంటి నుండి బయటకు పోకుండా ఉండాలనీ చెబుతోంది పూజా హెగ్డే. ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల బన్ని సరసన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీటికి తోడు హిందీలో సల్మాన్‌తో పాటు మరో సూపర్ స్టార్ అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa