ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొఫెషనల్ బాక్సర్ తో ట్రైన్ అవుతున్న రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 04, 2020, 05:36 PM

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. రామ్ చరణ్ లాక్‌డౌన్ పీరియడ్‌ను పూర్తిగా యూజ్ చేసుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో వాయిదా పడింది. దాంతో ఎవరికి వాళ్లు ఇంటికే పరిమితం అయిపోయారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సమయంలో సమయం వృథా చేయడం కంటే కూడా ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసాడు రామ్ చరణ్. అందులో భాగంగానే మరింత మేకోవర్ అవుతున్నాడు.దీనికోసమే చరణ్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. నీరజ్ గోయంక్ అనే ప్రొఫెషనల్ బాక్సర్‌ను నియమించుకున్నాడు రామ్ చరణ్‌. ఈయన ఆధ్వర్యంలోనే చరణ్ వర్కవుట్స్ కూడా చేస్తున్నాడు. RRR టీజర్‌లో కూడా బాక్సింగ్ చేస్తూ కనిపించాడు చరణ్. ఇక ఇప్పుడు తనతో రామ్ చరణ్ ఉన్న ఫోటోను షేర్ చేసాడు గోయంక్. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది. RRR తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చరణ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. దాంతో పాటే ఆచార్యలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa