ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య'లో అనసూయ..?

cinema |  Suryaa Desk  | Published : Tue, May 05, 2020, 04:42 PM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు సగానికిపైగా పూర్తయింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడినా ‘ఆచార్య’కు సంబంధించిన వార్తలను లీకువీరులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. లాక్ డౌన్ తరువాత తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో చిరంజీవి .. రెజీనా కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ వుంది. ఆ పాటను చిత్రీకరించడం జరిగిపోయింది.అనసూయపై మరో స్పెషల్ సాంగ్ ఉందనే టాక్ వచ్చింది. ఒక సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఎలా వుంటాయనే సందేహం మనకు వస్తుంది. అయితే ఈ సినిమాలో అనసూయపై స్పెషల్ సాంగ్ ఉన్నమాట వాస్తవమేనని అంటున్నారు. ఇందులో నక్సలైట్ గా నటిస్తున్న చరణ్ ఎపిసోడ్ లో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ పాటలో అనసూయ దుమ్మురేపేస్తుందన్న మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa