సుధీర్ - రష్మీ ఇద్దరినీ కలిసి వెండితెరపై చూడటానికి అభిమానులు ముచ్చట పడుతున్నారు. వాళ్ల కోరిక త్వరలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల కాలంలో సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో 'సాఫ్ట్ వేర్ సుధీర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి శేఖర్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా సమయంలోనే తరువాత సుధీర్ - రష్మీ జోడీగా ఒక సినిమా చేయాలనుందని అన్నాడు. ఆయనే ఇప్పుడు సుధీర్ - రష్మీ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఇక వెండితెరపై ఈ ఇద్దరూ కలిసి చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa