విజయ్ దేవరకొండ చేస్తున్న చారిటీపై కొన్ని వెబ్ సైట్ లలో తప్పుగా వార్తలు రావడంతో వారిపై విజయ్ దేవరకొండ ఫైర్ అయ్యారు. ఇప్పటికి వరకు 7 వేలకు పైగా కుటుంబాలకు సహాయం చేశామని, చేస్తున్న మంచిని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు వార్తలు పెట్టడం మంచిది కాదని వీడియో ద్వారా హెచ్చరించారు.తనపై నాలుగు వెబ్‌సైట్లు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నాయని సినీనటుడు విజయ్ దేవరకొండ నిన్న మండిపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు సినీ పరిశ్రమ నుంచి భారీగా స్పందన వస్తోంది. తాజాగా సినీనటుడు నాగబాబు కూడా స్పందిస్తూ ఆయనకు మద్దతు తెలిపారు.'హాయ్ విజయ్.. నేను నీకు మద్దతు తెలుపుతున్నాను. ఇటువంటి వెబ్‌సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసింది. సినీ పరిశ్రమ నుంచి వారు జలగల్లా రక్తం పీల్చుకుని తాగుతున్నారు. నీ ప్రతి స్పందనకు కృతజ్ఞతలు. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఫేక్‌న్యూస్‌ను, గాసిప్ వెబ్‌సైట్లను లేకుండా చేయాలని అన్నారు.కాగా, విజయ్ దేవరకొండకు ఇప్పటికే మహేశ్ బాబుతో పాటు అల్లరి నరేశ్, రవితేజ, హరీశ్ శంకర్, క్రిష్, అనిల్ రావిపూడి, కొరటాల శివతో పాటు పలువురు మద్దతు తెలిపారు. ఫేక్‌న్యూస్‌ను, గాసిప్ వెబ్‌సైట్లను అంతమొందించాలంటూ ట్వీట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa