నితిన్ తన కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు కాస్త వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమైన నితిన్ మొత్తానికి భీష్మ సినిమాతో సెట్టయ్యాడు. సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో మళ్ళీ తప్పటడుగులు వేయకుండా ప్రయోగాలకు దూరంగా ఉంటున్నాడు. తన మార్కెట్ ని ఇంకా పెంచుకోవాలని మినిమామ్ బాక్సాఫీస్ హిట్స్ కోసమే నితిన్ కష్టపడుతున్నాడు. 'భీష్మ' హిట్ తో నితిన్ మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు వున్నాయి. ఒక సినిమా సెట్స్ పై ఉండగా, రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాలు పూర్తయిన తరువాత ఆయన 'పవర్ పేట' అనే సినిమా చేయనున్నాడు.ఇంతకు ముందు నితిన్ తో 'ఛల్ మోహన్ రంగ' చేసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కథ నితిన్ కి ఒక రేంజ్ లో నచ్చిందట. కథ మొత్తాన్ని రెండున్నర గంటల్లో చెప్పలేమని భావించిన నితిన్, ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తే బాగుంటుందని భావించాడట. ఆ దిశగానే స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa