ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.200 చెల్లిస్తే హీరోయిన్ శ్రియ కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 05, 2020, 05:10 PM

లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌లు, కూలీలు, నిరాశ్ర‌య‌ల  స‌హాయార్ధం హీరోయిన్ శ్రియ స‌ర‌న్‌ న‌డుం బిగించారు. ఇందుకోసం ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న ఆమె.. వినూత్నంగా విరాళాలు సేక‌రిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ‘ది కైండ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పిన శ్రియ.. దినసరి కూలీలు, నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగులు, అనాథల కోసం విరాళాలు సేకరించబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తామని, వారు తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయొచ్చని వివరించారు.ఇందుకోసం www.thekindnessproject.in వెబ్ సైటులో రూ.200 విరాళంగా చెల్లించి రిసిప్ట్‌ను ఈమెయిల్ చేయాలని శ్రియ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఆదివారం విజేతల్ని ప్రకటించి, వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఓ మంచి పనికోసం అందరం కలిసి రావాలని శ్రియ పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa