చైతూ .. సమంత సొంత బ్యానర్లో తొలి హీరోగా రాజ్ తరుణ్ ఛాన్స్ కొట్టేశాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ దర్శకుడు తాజాగా చైతూ .. సమంతలకు ఒక కథను వినిపించాడట. ఆ కథను తమ బ్యానర్లో చేయడానికి చైతూ .. సమంత అంగీకరించినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుకానున్నట్టు చెబుతున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa