ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య సినిమా లో ఆత్రేయ ప్లేస్‌లో జార్జిరెడ్డి 'శాండీ'

cinema |  Suryaa Desk  | Published : Tue, May 05, 2020, 05:42 PM

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందకు రెడీ అయ్యారు.ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించిన ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య-బోయపాటి కసిగా చూస్తున్నారు.గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక్ హీరో, డైరెక్టర్ ఇద్దరూ సతమతమవుతుండటంతో, ఈసారి పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి తప్పులు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక బాలయ్యతో పాటు ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా ఉంటారని తెలుస్తోంది.అయితే ఆ యంగ్ హీరో ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో చాలా చర్చలు సాగుతున్నాయి.ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో యంగ్ హీరో, 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే, ఆ వార్తలను నవీన్ ఖండించాడు. తనకు అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని చెప్పాడు.తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. 'వంగవీటి', 'జార్జిరెడ్డి' సినిమాల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సందీప్ మాధవ్ ఈ చిత్రంలో ఛాన్స్ కొట్టేశాడనే వార్త వినిపిస్తోంది. సినిమాలో బాలయ్యకు అత్యంత దగ్గరగా ఉండే పాత్రలో నటించమని అడిగినట్టు, అందుకు సందీప్ అంగీకరించినట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత కరోనా పరిస్థితులు కొంత చక్కబడిన తర్వాత సినిమాకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు బోయపాటి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa