"చిలసౌ" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మరాఠి భామ.. తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. అయితే సినిమా బాగానే ఉన్నా కూడా ఎందుకో కానీ కమర్షియల్‌గా మాత్రం వర్కవుట్ కాలేదు. దాంతో ఈ భామకు అవకాశాలు పెద్దగా రాలేదు. కాగా చాలా రోజుల తర్వాత నాని నిర్మాణంలో హిట్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. దాంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె 'మోసగాళ్లు' .. ' డర్టీ హరీ' సినిమాలను చేస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలోను ఆమె నటిస్తోంది.ఈ మూడు సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలు తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయని భావించిన రహానీ శర్మ, తెలుగు భాష నేర్చుకోవడంపై దృష్టి పెట్టిందట. భాష వచ్చి వుంటే భావాలను సరిగ్గా పలికించడానికి అవకాశం ఉంటుందని భావించిన రుహానీ, తెలుగు నేర్చుకోవడానికి రోజుకి రెండు గంటల సమయాన్ని కేటాయిస్తుందట.ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వున్న రుహానీ, లాక్ డౌన్ పూర్తయ్యేలోగా తెలుగును నేర్చుకోవాలనే పట్టుదలతో గట్టిగానే కసరత్తు చేస్తోందట. తెలుగు భాష నేర్చుకున్న తరువాత, ఈ సుందరి తన పాత్రకి తానే డబ్బింగ్ చెబుతుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa