విశాఖపట్నంలోని గ్యాస్ లీక్ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తెల్లవారుజామున పరిశ్రమను తెరవబోతుండగా.. స్టైరిన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. దీనితో కొందరు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషాద సంఘటనపై చిరంజీవి మరియు మహేష్ స్పందించారు. విశాఖ లో విషవాయువు బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము అన్నారు. ఆలాగే సంబంధిత అధికారులు దీని బారినపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa