ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ.. ది సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్..

cinema |  Suryaa Desk  | Published : Sun, May 10, 2020, 01:17 PM

విజయ్ దేవరకొండ... ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం. అప్పుడెప్పుడో రవిబాబు తెరకెక్కించిన నువ్విలా.. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి సినిమాల్లో ఉన్నాడా లేడా లాంటి పాత్రలు చేసిన విజయ్..కేవలం నాలుగేళ్లలో ఓ కామన్ మ్యాన్ నుంచి సంచలనాలు సృష్టించిన హీరో స్థాయికి ఎదిగాడు. కేవలం ఒకట్రెండు సినిమాలతోనే ఇంత క్రేజ్ ఎలా తెచ్చుకున్నాడు అనేది అంతా ఓ మాయలా ఉంటుంది. అందుకే విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హీరో.
ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అనడానికి విజయ్ దేవరకొండని ఉదాహరణగా చూపించొచ్చు. పెళ్లి చూపులు సినిమాలో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిపోయాడు. ఆ సినిమా సంచలనం సృష్టించింది. ట్రెండ్ సెట్ చేసి విజయ్ కి స్టార్ డమ్ తీసుకొచ్చింది. గీత గోవిందం, టాక్సీ వాలా సినిమాలతో సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో ఫైటర్.. శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్నాడు ఈయన. విజయ్ డేట్స్ కోసం అగ్ర నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. మొత్తానికి ఐదేళ్లలో జీవితం మారిపోవడం అంటే ఇదే మరి.

విజయ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా న్యాచురల్ గా ఉంటాడు. స్టేజీలపై కూడా తనదైన శైలిలో మాట్లాడి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు. ఈ ఐదేళ్లల్లో విజయ్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి పోర్ట్స్ లిస్టులో టాప్ 30లో చోటు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇది చిన్న విషయం కాదు.. ఇండియా మొత్తంలో టాప్-30లో ప్లేస్ అందుకోవడం అనేది ఒక అరుదైన విషయం. కానీ అది రెండేళ్ల కిందే చేసాడు విజయ్. నాలుగేళ్ల కిందట ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లో 500 రూపాయలు ఉండేవని.. అది క్లోజ్ కాకుండా ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ 500 మెయింటెన్ చేయాల్సి వచ్చేదని చెప్పాడు. కాలచక్రంలో నాలుగేళ్ల తర్వాత 30 ఏళ్ళ కంటే తక్కువగా ఉండి ఇండియాలో టాప్ సెలబ్రిటీస్‌లో నిలిచాను.. గర్వంగా ఉంది అంటూ అప్పట్లో ఈయన చేసిన ట్వీట్ కూడా సంచలనమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa