మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ లో విడుదలైన అద్భుత దృశ్యకావ్యం 'జగదేక వీరుడు అతిలోక సుందరి' విడుదలై నేటికీ 3 దశాబ్దాలు అవుతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ముందుగా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు చిరూ ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సినిమాలో దేవకన్య పాత్రకు ప్రాణం పోసిన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
దేవకన్యగా ఆమె నటన అద్భుతం. ఆమె తప్ప మరెవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేము. ఒకానొక దశలో ఆమె హావభావాలు చూసి ఆమె ముందు నటనలో తేలిపోతానేమో అని భయపడ్డా అని చిరూ తెలిపారు. ఇప్పటికీ దేవకన్య అనగానే శ్రీదేవి గుర్తుకొస్తుంది. అసలు శ్రీ దేవి లేకపోతే ఈ సినిమానే లేదని చిరంజీవి ఆమెను ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa