ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్ డౌన్ తో నిలిచిపోయిన "క్రాక్"షూటింగ్.. ఒక్క సీన్ తీస్తే చాలట...

cinema |  Suryaa Desk  | Published : Tue, May 12, 2020, 03:21 PM

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'  సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఒక సీన్ మాత్రమే పెండింగ్ వుంది. ఆంధ్రలోని ఒక సరుగుడు తోటలో ఈ సీన్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ లోగా లాక్ డౌన్ ను ప్రకటించడంతో షూటింగు ఆగిపోయింది.  లాక్ డౌన్ ఎత్తేయగానే  ఈ ఒక్క సీన్ ను చిత్రీకరించుకుని వస్తారట.


శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో విడుదల చేయాలని భావిస్తున్నారట. గతంలో రవితేజ - శ్రుతిహాసన్ జంటగా నటించిన 'బలుపు' భారీ విజయాన్ని సాధించింది. అందువలన ఈ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి తలెత్తుతోంది. ఇక చాలా గ్యాప్ తరువాత శ్రుతి హాసన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. అందువలన ఆమె అభిమానులంతా ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు రవితేజ .. గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాలను అందుకోవడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa