తెలుగు తెరకి మరో మలయాళ ముద్దుగుమ్మ పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ ఒక సినిమాను చేయనున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ రావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ సినిమాలో కథానాయికగా మానస రాధాకృష్ణన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేరళలో పుట్టిన ఈ సుందరి, దుబాయ్ లో పెరిగింది. ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయవలసి వుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో 'పరమగురు' సినిమా చేస్తోంది. పవన్ తో చేసే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa