ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఉదయం ఒక ఇంటివాడైన కమెడియన్ మహేష్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 14, 2020, 01:18 PM

 మహేష్ ఆచంట కామెడీ షో జబర్ధస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని నటుడిగా మారాడు.  మహేష్ ఆచంట నేడు వివాహం చేసుకున్నారు. మహేష్, పావనిల వివాహం నేడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం, శివకోడు గ్రామంలో జరిగింది. నేడు ఉదయం 6:31 నిమిషాల ముహూర్తానికి మహేష్… పావని మెడలో తాళి కట్టాడు. లాక్ డౌన్ నిబంధల కారణంగా ఈ వివాహానికి కేవలం వధూవరుల తల్లితండ్రులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. కమెడియన్ గా వెండితెరకు పరిచయమైన మహేష్ రంగస్థలం, మహానటి, గుణ 369, యాత్ర వంటి చిత్రాలలో కీలక రోల్స్ చేశాడు. కాగా నేడు ఇదే ముహూర్తానికి నిఖిల్, పల్లవిని పెళ్లి చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa