ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయపాటి , బాలయ్య సినిమాలో బాలీవుడ్ విలన్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 14, 2020, 05:10 PM

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమా ఇది విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం శ్రీకాంత్ ను తీసుకున్నారు.దాంతో ఈ సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా అనుకున్నారు. కానీ శ్రీకాంత్ కాకుండా మరో విలన్ కూడా ఉంటాడట. ఆ విలన్ ను బాలీవుడ్ నుంచి రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న బాలీవుడ్ ఆర్టిస్టును తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. బాలకృష్ణకి .. బాలీవుడ్ విలన్ కి మధ్య భారీ యాక్షన్ సీన్స్ .. చేజింగ్స్ వుంటాయని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. 'సింహా' .. 'లెజెండ్' వంటి భారీ విజయాల తరువాత బోయపాటి - బాలయ్యల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు  వున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa