కరోనా వల్ల అంతా తారుమారైంది.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల దాదాపు రెండు నెలలు వాయిదాపడింది. దీంతో చిత్రీకరించాల్సిన చాలా ముఖ్యమైన సన్నివేశాలు మిగిలిపోయాయి. ఇక చేసేదేం లేక మరోసారి విడుదలను ముందుకు జరుపనున్నారు. ఈ విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ కన్ఫామ్ చేశాడు. అయితే సంక్రాంతి రావట్లేదని దానయ్య హింట్ ఇవ్వడంతో మిగితా సినిమాలకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. సంక్రాంతి బరి ఖాళీ అయ్యింది. దీనితో మరి సంక్రాంతి బరిలో దిగే ఆ హీరోలు ఎవరనే ఆసక్తి మొదలైంది. అందులో భాగంగా టాలీవుడ్ లోని ముగ్గురు టాప్ హీరోలకు మాత్రమే సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే మొదటినుండి ఈ సినిమాను దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ తాజా పరిస్థితులు కారణంగా ఆర్ ఆర్ ఆర్ వాయిదాతో ఆచార్య సంక్రాంతి పై కన్నేసే అవకాశం మెండుగా ఉంది. ఈ సంక్రాంతి బరిలో బాలయ్య కూడా వచ్చే అవకాశం ఉంది. బాలయ్య బోయపాటితో ఓ మూవీ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా బంద్ అయ్యింది. త్వరలో షూట్ మొదలుకానుంది. సంక్రాంతి హీరోగా ఉన్న బాలయ్య 2021 సంక్రాంతికి బోయపాటి చిత్రంతో ఖచ్చితంగా వస్తాడు అనిపిస్తుంది. అలాగే మరో స్టార్ హీరో ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణ తో చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా 50శాతం వరకు షూట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కూడా సంక్రాతి బరిలో దిగే అవకాశం కలదు. చూడాలి మరి ఈ సారి సంక్రాంతికి ఏయే సినిమాలు బరిలోకి రానున్నాయో.. పోయిన సంక్రాంతికి మహేష్, అల్లు అర్జున్ సినిమాలు వచ్చి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్‌గా మారి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa