ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నిశ్శబ్దం' విడుదలపై చర్చలు! .

cinema |  Suryaa Desk  | Published : Sat, May 16, 2020, 04:51 PM

భాగమతి తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్గా గా ఈ సినిమా విడుదల కాబోతుంది. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మాడిసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ నిర్మిస్తున్నారు. లుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారునిర్మాణం పూర్తి చేసుకున్నవి రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. మరోపక్క, సందట్లో సడేమియాలా ఇలా రిలీజ్ కాకుండా ఆగిపోయిన చిత్రాలను తాము డిజిటల్ ప్లాట్ ఫాంపై విడుదల చేస్తామంటూ ఓటీటీ సంస్థలు ఎంటరవుతున్నాయి. భారీ మొత్తాలను కూడా ఆఫర్ చేస్తున్నాయి.అయితే, కొందరు నిర్మాతలకు ఈ ఆఫర్లు ఆకర్షణీయంగానే కనపడుతున్నా, ఆ సినిమాలలో నటించిన హీరోల వల్ల ఒప్పందాలు జరగడం లేదు (ఓటీటీ ద్వారా రిలీజైపోతే తమ పాప్యులారిటీ తగ్గిపోతుందన్నది పెద్ద హీరోల అభిప్రాయం. అందుకే థియేటర్ రిలీజ్ నే కోరుకుంటారు). అనుష్క నటించిన 'నిశ్శబ్దం' చిత్రం కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది.ఈ చిత్రాన్ని తమ ఓటీటీ ద్వారా విడుదల చేస్తామంటూ ఓ ప్రముఖ సంస్థ ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలను సంప్రదించిందట. భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసిందట. అయితే, నిర్మాతలు ఓ కండిషన్ పెడుతున్నారని సమాచారం. అదేమిటంటే, లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత చిత్రాన్ని థియేటర్లలో కూడా విడుదల చేసుకోవడానికి అనుమతించాలన్నది! ప్రస్తుతం దీనిపైనే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే దీని విడుదల పలుసార్లు వాయిదాలు పడడంతో నిర్మాతలు కూడా బయటపడడానికి సీరియస్ గా ఆలోచిస్తున్నారట.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa