దీర్షకుడు బి.గోపాల్ తో ప్రాజక్టుకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం స్క్రిప్టు పని జోరుగా సాగుతోంది. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ స్క్రిప్టుకి మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని సమాచారం.విశేషం ఏమిటంటే, ఇందులో బాలకృష్ణ ఓ యువతికి తండ్రిగా సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తారని, ఇది కచ్చితంగా ఆయనకు విభిన్నమైన పాత్ర అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగుకి బ్రేక్ పడింది. లాక్ డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. ఆ చిత్రం పూర్తికాగానే బి.గోపాల్ చిత్రం సెట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa