తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకూ మరెవరికీ దక్కని వన్ బిలియన్ వ్యూస్ రికార్డును సాధించింది 'అల వైకుంఠపురములో'.యూ ట్యూబ్ లో ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని ఓ ట్వీట్ ద్వారా తెలియజేసిన గీతా ఆర్ట్స్, "మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు" అని పేర్కొంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించగా, ప్రతి పాటా హిట్ అయింది. సినిమా విడుదలై నాలుగు నెలలు అయినా, రికార్డు మీద రికార్డును సొంతం చేసుకుంటూనే ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa