వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏదొక మాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తాడు.. తన ట్వీట్స్ తో అవతలివారికి అసహనం తెప్పిస్తాడు.. మొన్న ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియోతో దేశమంతటా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. జనాలు దేన్ని వ్యతిరేకిస్తారో వర్మ మాత్రం దాన్నే చేస్తాడు.. ఎవరి మాట పట్టించుకోడు.. తనపై ఎన్ని విమర్శలు వస్తున్న వర్మ మాత్రం అవన్నీ ఎంజాయ్ చేస్తాడు..
ఈ నేపథ్యంలోనే వర్మ మరో ట్వీట్ వదిలాడు.. పెళ్లిళ్లు, అంత్యక్రియలు అంటూ సరికొత్త ట్వీట్ చేశాడు. అసలు ఈ పెళ్లిళ్లు, అంత్యక్రియలు అంటే తనకు అసహ్యమని, ఇందులో ఒకటి వ్యక్తి స్వాతంత్ర్యాన్ని చంపేస్తే, మరోటి శరీరాన్ని చంపేస్తుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా, ఇప్పుడు సంచలనం అయింది.. దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తిగా రిప్లై ఇస్తున్నారు.. ‘‘అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి సర్’’ అని ఒకరు ప్రశంసిస్తే.. ‘‘తమరి సినిమాలపైనా మాకు అదే భావన’’ అని ఇంకొకరు చురకలంటించారు.. మీరు చేసే పోస్టులు అర్థం తనకు అర్థం కాకున్నా అందులోని రిథమ్ తనకు నచ్చుతుందని కామెంట్స్ చేస్తున్నారు..
I hate both weddings and funerals for the reason that one is the death of freedom and the other is the death of the body
— Ram Gopal Varma (@RGVzoomin) February 5, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa