బాలీవుడ్ స్టార్ కథానాయిక కరీనా కపూర్ ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే ఇష్టమట. అంతే కాదండోయ్.. అతని గురించి తెలుసుకోవాలని ఉందని, రాహుల్‌తో మాట్లాడడానికి కూడా తనకు అభ్యంతరం లేదని చెప్పింది. అదేంటి కరీనా పెళ్లై ఒక బాబుతో సంతోషంగా ఉంది కదా? ఇప్పుడు ఈ ట్విస్టేంటని అనుకుంటున్నారా? ఇది ఇప్పటి మాట కాదులెండి. 2002 సంవత్సరంలో ఓ షోలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు కరీనా చెప్పిన సమాధానమిది. ప్రస్తుతం కరీనా వ్యక్తిగతంగా వృత్తిపరంగా సంతోషంగా ఉంది. నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం తైమూర్ అనే కొడుకుతో కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే దాదాపు 16 ఏళ్ల క్రీతం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2002 సంత్సరంలో ‘రెండెజ్‌వోస్ విత్ సిమి గేర్‌వాల్’ అనే టాక్ షోలో పాల్గొంది కరీనా. అప్పటికి కరీనా కూడా ఇండస్ట్రీలో కొత్తగా అడుగులు వేసే రోజులు. అయితే, కరీనా బాలీవుడ్‌లో బాగా పాపులారిటీ ఉన్న కపూర్ ఫ్యామిలీ నుంచి రావడంతో వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకుందామనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. దీన్లో భాగంగానే షో హోస్ట్ సిమి గేర్‌వాల్ కరీనా ప్రేమ వ్యవహారం గురించి అడిగింది. దీనికి సమాధానంగా ‘‘సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమలో పడతాను. నాకు తారసపడే వ్యక్తి ఆలోచనా విధానం కూడా నాలాగే ఉండాలి. అలాంటి వ్యక్తినే ప్రేమిస్తాను’’ అని సమాధానం చెప్పింది. అయితే ఆ వ్యక్తి ఎవరని హోస్ట్ అడగ్గా బాలీవుడ్ స్టార్ల పేర్లు కాకుండా రాహుల్ గాంధీ పేరు చెప్పింది.
‘‘ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలీదు కానీ.. రాహుల్ గాంధీ అంటే ఇష్టం. అతని గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. అతని ఫొటోలు పేపర్లలో చూస్తూ ఉంటాను. అతనితో మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బంది లేదు. నాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం. రాహుల్‌ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా ఇద్దరి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని నా అభిప్రాయం’’ అని కుండబద్దలు కొట్టేసింది. అప్పుడెప్పుడే జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కరీనా ప్రస్తుతం ‘వీరే ది వెడ్డింద్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.