హీరోయిన్లకు సంపాదనకు తగ్గట్టే ఖర్చు ఉంటుందని 'కబాలీ' ఫేమ్ రాధికా ఆప్టే అంటోంది. అందాన్ని కాపాడుకోవడం, దుస్తులు, చక్కటి శరీరాకృతి కోసం ట్రైనర్‌ని ఏర్పాటు చేసుకోవడానికి బోలెడంత ఖర్చవుతుందని ఈ బ్యూటీ అంటోంది. కథానాయిక అనేది ఒక ఖరీదైన ఉద్యోగమని ఆమె చెబుతోంది. గతేడాదంతా చిత్రీకరణలతో చాలా బిజీగా గడిపానని, ఆ సినిమాలన్నీ ఈ ఏడాదిలో రిలీజ్ అవుతాయని ఆమె తెలిపింది. కాస్త విరామం తీసుకుని కొత్త చిత్రాలకు ఒప్పుకుంటానని ఈ 'లెజెండ్' సుందరి చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సరసన తాను నటించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ....ఈ సినిమాలో భాగమైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని, టైటిల్ రోల్‌కు అక్కీ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని తెలిపింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ బాల్కీ చాలా సున్నితమైన రీతిలో తెరకెక్కించారంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa