నడిగర్ సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విశాల్ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు..చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నాడు. డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని ప్రకటించాడు. పనిలో పనిగా ఆ భవనంలోని కళ్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని తెలిపాడు. ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చి మండపాన్ని బుక్ చేసుకున్నానని తెలిపాడు. అయితే వధువు ఎవరు? అన్నది మాత్రం సీక్రెట్ గా ఉంచాడు. కాగా, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్నాడు.. ఆమెనే పెళ్లి చేసుకోనున్నట్లు టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa