ఇప్పటివరకూ డార్లింగ్ ప్రభాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యు.వి. క్రియేషన్స్.. ఇప్పుడు మెగా కాంపౌండ్ కి షిప్ట్ అవ్వబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఇద్దరు మెగా హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నిర్మించడానికి ఈ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుందట. యు.వి.క్రియేషన్స్. ప్రభాస్‌తో 'మిర్చి', 'సాహో' చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పుడు 'రాధేశ్యామ్'ను సెట్స్‌పై ఉంచింది. ప్రభాస్‌కి మాతృ సంస్థ వంటి యు.వి... నానితో 'భలే భలే మగాడివోయ్', శర్వానంద్‌తో 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి చిత్రాలను కూడా నిర్మించింది.
ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ మెగా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టబోతుందట. 'ఆర్.ఆర్.ఆర్', 'ఆచార్య' తర్వాత చరణ్ యు.వి. సంస్థలోనే మూవీ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ మూవీకి యు.వి.తో పాటు చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ భాగస్వామిగా ఉండనుందట. 'భీష్మ' డైరెక్టర్ వెంకీ కుడుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. గతంలో రామ్ చరణ్ 'రంగస్థలం', 'వినయ విధేయ రామ' సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించింది యు.వి. రామ్ చరణ్‌తో పాటు... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తోనూ ఓ సినిమా నిర్మించడానికి యు.వి. క్రియేషన్స్ సన్నాహాలు చేస్తోందట. తమ సంస్థలో 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రానికి దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మేర్లపాక నితిన్‌తో 'అంధాధున్' రీమేక్ తెరకెక్కించే పనిలో ఉన్నాడట. వరుణ్ కూడా కిరణ్ కొర్రపాటితో బాక్సింగ్ డ్రామా... ఆ తర్వాత 'ఎఫ్-2' సీక్వెల్ లైన్‌లో ఉంచాడు. మరి బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మెగా కాంపౌండ్ హీరోలతో మెగా ప్రాజెక్టులను సెట్ చేసిన యు.వి.క్రియేషన్స్ ఆ మూవీస్ తో ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa