ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తిరిగి షూటింగుకి రావడం బాగుంది..' : నివేద థామస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 07, 2020, 01:04 PM

చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. హిందీలో హిట్టయిన 'పింక్' సినిమా ఆధారంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం లాక్ డౌన్ కి ముందు జరిగిన షెడ్యూల్ లో పూర్తయింది. లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది.


ప్రస్తుతం పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న కథానాయిక నివేద థామస్ కూడా ఈ రోజు ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని నివేద సోషల్ మీడియాలో వెల్లడించింది. 'తిరిగి షూటింగుకి రావడం బాగుంది..' అంటూ నివేద పోస్ట్ పెట్టింది.


కాగా, హీరో పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే ఈ చిత్రం షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. కథానాయికలు అంజలి, శ్రుతి హాసన్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa