ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ లో అర్జున్ రెడ్డిలు వీళ్ళే!

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 10, 2020, 04:54 PM

బిగ్ బాస్ ప్ర‌తీ సీజ‌న్‌లో ఓ అర్జున్ రెడ్డి క్యారెక్ట‌ర్ అనేది ప‌క్కాగా ఉంటోంది. వీళ్లు చిన్న విష‌యానికి కూడా చిందులు తొక్కుతుంటారు. మ‌రి మొద‌టి సీజ‌న్ నుంచి నాల్గవ సీజ‌న్ వ‌ర‌కు ఆ అర్జున్‌రెడ్డి ఎవరెవ‌రున్నారో గమనించారా? అయితే చదివేయండి..
ఇస్మార్ట్‌ సోహైల్ - ఈ సీజ‌న్‌లో ఐదో కెప్టెన్‌గా అవ‌త‌రించాడు. మొద‌ట్లో కాస్త సాఫ్ట్‌గా క‌నిపించిన సోహైల్ ఉన్న‌ట్టుండి వ‌యొలెంట్‌గా మారిపోయాడు. గొడ‌వ ప్రారంభ‌మైందంటే చాలు క‌థ వేరుంట‌ది అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. చూస్తున్నారు కదా ఇతని హైపర్ బిహేవియర్.
త‌మ‌న్నా సింహాద్రి-మొట్ట‌మొద‌టిసారి ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చారు. మొద‌ట బాగానే ఉన్న ఆమె త‌న విశ్వ‌రూపం చూపించింది. స‌హ కంటెస్టెంటు ర‌వికి చుక్క‌లు చూపించింది. ప‌ప్పు అని ఆడుకుంటూ అత‌డిని ఏడిపించింది.
అలీ రెజా- వీరావేశంతో ఎదుటివారిపై నోరు జార‌డంతో షో మ‌ధ్య‌లోనే వీడ్కోలు తీసుకోవాల్సి వ‌చ్చింది. అత‌ని కోప‌మే అత‌ని పాపులారిటీని, ఓట్ల‌ను దెబ్బ తీసింది.
తనీష్ - రెండో సీజ‌న్‌లో పాల్గొన్న హీరో త‌నీష్‌ను కోపానికి కేరాప్ అడ్ర‌స్‌గా చెప్పుకోవ‌చ్చు. కౌశ‌ల్, నూత‌న్ నాయుడుతో త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవి. వీటికి హ‌ద్దూ అదుపూ ఉండేది కాదు.
శివ‌బాలాజీ-అన్నీ అమ‌ర్చిన బిగ్‌బాసే ఒక్కోసారి కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు క‌నీసం మంచినీళ్లు కూడా ఇవ్వ‌డు. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో బిగ్‌బాస్‌ను అభ్య‌ర్థించాల్సింది పోయి అత‌డిపైనే ఆవేశ‌పెట్టాడు శివ‌బాలాజీ.‌ ఆ ఎపిసోడ్ భలే బాగుంటుంది లెండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa