కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’లో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలైన దగ్గర్నుండి మహేష్ బాబుని దగ్గరగా గమనించిన ఆమె ఆయన ప్రవర్తన పట్ల బాగా ఇంప్రెస్ అయింది. ఎప్పుడు మహేష్ ప్రస్తావన వచ్చినా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్న ఈమె తాజాగా కూడా పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
మహేష్ బాబు సెట్స్ లో ఒక సూపర్ స్టార్ లా కాకుండా చాలా సింపుల్ గా ఉంటారని, తను షూటింగ్లో తెలుగు డైలాగ్స్ నేర్చుకునే వరకు చాలా ఓపిగ్గా ఎదురుచూస్తారని, ఎప్పుడు కలిసినా సినిమా విషయాలు తప్ప ఇంకేమీ మాట్లాడారని, ఆయనకెప్పుడూ సినిమాలు ధ్యాసేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa