మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పిరియాడికల్ డ్రామా ‘రంగస్థలం 1985’. ఈ సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చెర్రీ ఫుల్ కామెడీతో ఆకట్టుకుంటాడని సుక్కు వెల్లడించి అభిమానులను ఖుషీ చేశారు. అనంతరం ఇది లవ్ స్టోరీ కాదు మర్డర్ మిస్టరీ అంటూ షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయింది. అయితే మర్డర్ మిస్టరీతో పాటు లవ్ స్టోరీ కూడా సైమల్‌టేనియస్‌గా నడుస్తూ ఉంటుందట.
ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ పిక్ బయటకు వచ్చింది. చెర్రీతో పాటు ఈ సినిమాలో నటిస్తున్న మరో అందాల బొమ్మ పూజిత. ఈ పూజిత ఎవరు? ఈ సినిమాలో ఆమె రోల్ ఏంటనేది? ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్. ఇవన్నీ పక్కన పెడితే పూజితను తన సినిమా కోసం ఎంచుకుని సుక్కు మంచి డెసిషన్ తీసుకున్నారని చెర్రీ అభిమానులు భావిస్తున్నారు. 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉన్న పూజిత హాఫ్ శారీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa