ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2017, 03:05 PM

ముంబయి: ఆమిర్‌ ఖాన్‌, జైరా వాసిం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమిర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. ఫస్ట్‌లుక్‌లో జైరా వాసిం స్కూల్‌ డ్రెస్‌ వేసుకుని నడుచుకుంటూ వెళుతున్నట్లు చూపించారు. ఈ చిత్రంలో జైరా వాసిం గాయని కావాలని ఆశపడుతుంది. కానీ తన తండ్రి రోజూ తాగి వచ్చి తనని, అమ్మని చిత్రహింసలు పెడుతుంటాడు. తన తల్లిని తాగుబోతు తండ్రి నుంచి కాపాడుకుని తన ఆశయం ఎలా నెరవేర్చుకుంటుంది అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఆగస్టు 2న విడుదల కాబోతుంది. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa