ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారుపై నిరసనకారులు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే, 2015లో స్త్రీల మానం గురించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణకు గాను ఆమె మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కారుపై దాడి జరిగింది. విచారణ సమయంలో ఖుష్బూను మేజిస్ట్రేట్ కొన్ని ప్రశ్నలు వేశారు. ఆమె చెప్పిన సమాధానాలను విన్న తర్వాత తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa