ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకీ సినిమా లో నటించడానికి శ్రీయ కు ఎంత ఇచ్చారు తెలుసా ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 11:02 AM

తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించబోయే సినిమా ‘ఆట నాదే వేటా నాదే’ సినిమాలో హీరోయిన్ గా శ్రియను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇది వరకూ పలు పేర్లు వినిపించాయి. అయితే చివరకు అవకాశం శ్రియ వద్దకు వచ్చి ఆగింది. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో జతకడుతూ వస్తున్న శ్రియ ఇప్పుడు వెంకీతో జతకడుతోంది.


ఇది వరకూ వెంకీ, శ్రియ కాంబోలో ఒక సినిమా వచ్చింది. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ సినిమా పేరు ‘సుభాష్ చంద్రబోస్’ అయితే అది డిజాస్టర్ గా నిలిచింది.ఆ సంగతలా ఉంటే.. వెంకీతో తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా ముందుగా కాజల్ ను అనుకున్నాడట తేజ. ఆమె కోటి రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసినట్టుగా సమాచారం. అంతకు తక్కువ అయితే చేసేది లేదని స్పష్టం చేసిందట కాజల్. ఈ నేపథ్యంలో శ్రియను సంప్రదించగా.. ఈమె అరవై లక్షల రూపాయల రెమ్యూనరేషన్ కే ఓకే చెప్పినట్టు సమాచారం. తక్కువ పారితోషకం అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని శ్రియను ఓకే చేశారట!


తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించబోయే సినిమా ‘ఆట నాదే వేటా నాదే’ సినిమాలో హీరోయిన్ గా శ్రియను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇది వరకూ పలు పేర్లు వినిపించాయి. అయితే చివరకు అవకాశం శ్రియ వద్దకు వచ్చి ఆగింది. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో జతకడుతూ వస్తున్న శ్రియ ఇప్పుడు వెంకీతో జతకడుతోంది.


ఇది వరకూ వెంకీ, శ్రియ కాంబోలో ఒక సినిమా వచ్చింది. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ సినిమా పేరు ‘సుభాష్ చంద్రబోస్’ అయితే అది డిజాస్టర్ గా నిలిచింది.


ఆ సంగతలా ఉంటే.. వెంకీతో తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా ముందుగా కాజల్ ను అనుకున్నాడట తేజ. ఆమె కోటి రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసినట్టుగా సమాచారం. అంతకు తక్కువ అయితే చేసేది లేదని స్పష్టం చేసిందట కాజల్. ఈ నేపథ్యంలో శ్రియను సంప్రదించగా.. ఈమె అరవై లక్షల రూపాయల రెమ్యూనరేషన్ కే ఓకే చెప్పినట్టు సమాచారం. తక్కువ పారితోషకం అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని శ్రియను ఓకే చేశారట!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa