ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటిగా తెరపై ఏదైనా చేయగల

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 01:48 PM

నాయిక ప్రధాన చిత్రాలతో బాలీవుడ్‌లో కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది విద్యాబాలన్‌. జాతీయ ఉత్తమ నటిగా పలు ప్రభావవంతమైన చిత్రాల్లో నటించింది. పరిణీత, ఇష్కియా, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా, డర్టీ పిక్చర్‌, కహానీ, బేగమ్‌ జాన్‌ లాంటి నాయిక ప్రధాన చిత్రాలతో ప్రేక్షకలకు మర్చిపోలేని నాయిక అయ్యింది. సినిమాలంటే కల్పనే. అయితే ఈ కాల్పనిక చిత్రాల్లోనూ తనను ఎక్కడో ఒక దగ్గర పోల్చుకున్నానని చెబుతోంది విద్యా బాలన్‌. తను చేసిన పాత్రలతో వ్యక్తిగత అను బంధం ఉందని అంటోంది. ప్రతి కథలోనూ తనను తాను చూసుకున్న సం దర్బా éలున్నాయని తెలిపింది. ఇటీవల విద్యా బాలన్‌ మా ట్లాడుతూ….నేను చేసిన ప్రతి చిత్రం నా మనసుకు దగ్గరైనదే, నాకు వ్యక్తిగత అనుబంధాన్ని ఇచ్చినదే. నేను చేసిన నాయిక ప్రధాన చిత్రాలన్నింటిలో నాయికలు తమకు నచ్చింది చేస్తుంటారు. మనసుకు తోచిన దారిలో వెళ్తుంటారు. వ్యక్తిగతంగా నేనూ అలాంటి మహిళనే. అయితే నటిగా తెరపై ఏదైనా చేయగల, ఎలాగైనా నటించగల నేను వ్యక్తిగతంగా కొంత సిగ్గరిని. అని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa