ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి అలవాటు లేదంటోంది తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 02:29 PM

ఒకసారి దర్శకుడిని, కథనూ అంగీకరించాక…అతను చెప్పినట్లు నటిస్తానని, అంతకు మించిన స్వేచ్ఛ తీసుకోనని అంటోంది మిల్క్‌ బ్యూటీ తమన్నా…ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుంది. అది మరొకరి సృజనతో పోలి ఉండదు. ఇది ఎవరిది వాళ్లకు ప్రత్యేకం. మా ఆలోచనే బాగుంది అనడానికి లేదు. ఎవరి ఆలోచన వాళ్లకు బాగానే ఉంటుంది. సినిమా బృంద పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అంతా ఐక్యంగా ఒక మాటపై ఉండి సినిమా రూపకల్పన చేయాలి. దర్శకుడు వీళ్లందరినీ నడిపించాలి. సృజనాత్మక స్వేచ్ఛ ఉందని..ప్రతి ఒక్కరూ దర్శకుడి పనిలో దూరితే కష్టం. కానీ అలాంటివి దాదాపు ప్రతి చిత్రంలో జరుగుతుంటాయి. ఏదో చెబుతున్నాడు…విందాం అనుకుంటే తప్పు లేదు. సర్దుకుపోవచ్చు. ఇదే చేయాలి అంటేనే ఇబ్బంది. ఎవరి పని వాళ్లు చేసుకోకుండా పక్కోడి పని చెడగొడు తుండటం షూటింగ్‌ సమయాల్లో చూస్తూనే ఉంటాం. కొద్దిగా అనుభవం ఉన్న హీరోలు, హీరోయిన్‌లు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే తనకు అలాంటి అలవాటు లేదంటోంది తమన్నా. ఒకసారి దర్శకుడు, కథను అంగీకరించాక…అతను చెప్పినట్లు నటిస్తానని, అంతకు మించిన స్వేచ్ఛ తీసుకోనని అంటోంది. తాజాగా తమన్నా నటిస్తున్న ఓ చిత్రంలో తమన్నాకు దర్శ కుడితో క్రియేటివ్‌ గొడవలు వచ్చాయన్న పుకార్ల నేప థ్యంలో తమన్నా ఇలా స్పందించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa