ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దయచేసి అలా చెయ్యకండి అంటున్న నాని

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 11:51 AM

సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది. ప్రతి విషయం నిమిషాల్లో తెలిసిపోతోంది. జియో సిమ్ కార్డ్స్ వచ్చాక జనాలు ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. నెట్ లో సినిమా తారల గురించి వచ్చే వార్తలు బాగా పాపులర్ అవుతున్నాయి. ఆ వార్తలో నిజం ఉందా లేదా అన్న విషయాని పక్కనపెడితే న్యూస్ వైరల్ గా మారుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని యుట్యూబ్ చానల్స్ వారు గాసిప్స్ ను బాగా పాపులర్ చేస్తున్నారు.


తాజాగా ఒక వెబ్ సైట్ లో నాని కి సంభందించిన వార్తా బయటికి వచ్చింది. ఆ ఆర్టికల్ లో నానిని తక్కువ చేసి మాట్లాడినట్లు ఉంది. నాని గుటించి బ్యాడ్ గా రాయడమే కాకుండా ట్విట్టర్ లో ఆ ఆర్టికల్ ను నానికి ట్యాగ్ చేసారు ఆ వెబ్ సైట్ వారు. అది చూసిన నాని రియాక్ అయ్యాడు. ఇలా నాన్సెన్స్ రాసినప్పుడు దయచేసి నన్ను ట్యాగ్ చెయ్యవద్దని పిలుపునిచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa