ఎంతోకాలం ప్రేమించుకుని ఎట్టకేలకు అనుష్కను వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ ఇప్పడు తన భార్యను చూసి తెగ భయపడిపోతున్నాడు.. ఆమె తాజాగా నటించిన పరి మూవీని చూడటమే కారణమట… హర్రర్ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రంలో అటు దెయ్యంగా, ఇటు గృహిణిగా రెండు పాత్రలను పోషించింది అనుష్క..తన భార్య మిగతా చిత్రాలతో పోలిస్తే అద్భుత నటనను ఇందులో చూపిందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు. చాలాకాలంగా ఇంత మంచి చిత్రాన్ని తాను చూడలేదని చెప్పాడు. సినిమా చూసి తాను కొంత భయపడ్డానని, ఇదే సమయంలో ఆమె నటనకు ముగ్ధుడినై గర్వపడుతున్నానని అన్నాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa