అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం "AP04 రామాపురం" . ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ల ను ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన కిరణ్ అబ్బవరం (ఎస్ ఆర్ కళ్యాణ మండపం హీరో) సినిమా టైటిల్ ను, కడప నగర మాజీ మేయర్ & వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు గారు టైటిల్ వీడియో ను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గారు సినిమా మోషన్ పోస్టర్ ను కడప నగరంలోని YSR ఆడిటోరియం నందు ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమం లో సైకం రామ కృష్ణా రెడ్డి (పీపుల్ లీడర్) కె. చంద్రా రెడ్డి గోల్డ్ షాప్ నాగరాజు. సినిమా లో నటించిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa