వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో యంగ్ హీరో రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కేవలం నెలన్నర రోజుల డేట్లు మాత్రమే ఇచ్చాడట. ఆ డేట్లతోనే రీమేక్ షూటింగ్ ను ముగించే విధంగా దర్శకుడు ప్లాన్ చేశాడు. తక్కువ డేట్లతో వెంటనే పూర్తి చేయబోతున్నాడు కనుకే ఈ రీమేక్ ను పవన్ కల్యాణ్ మొదట చేస్తున్నాడు. ఈ రీమేక్ పూర్తి అవ్వడమే ఆలస్యం మార్చి లేదా ఏప్రిల్ నుండి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు పవన్ ఇప్పటికే డేట్లు కూడా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో క్రిష్ ప్రీ ప్రొడక్షన్ పనుల హడావుడిలో ఉన్నాడు. ఇటీవలే పవన్ మూవీ కోసం జబర్దస్త్ యాంకర్ అనసూయతో క్రిష్ చర్చలు జరిపాడంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపిక అవ్వగా మరో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాడెజ్ ను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా ఈ వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు క్రిష్ అధికారికంగా ఆమెను కన్ఫర్మ్ చేశాడని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే రెండు సినిమాల్లో ప్రత్యేక పాటలతో గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు త్వరలో క్రిష్ సినిమాతో పూర్తి స్థాయి పాత్రతో ఆకట్టుకోబోతుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె పవన్ తో సినిమా తర్వాత టాలీవుడ్ లో కూడా బిజీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa