సీనియర్ నటుడు రాజశేఖర్ అందరికీ సుపరిచితమే. తనదైన నటన, డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని తన నటన విశ్వరూపాన్ని చూపించారు. అయితే ప్రస్తుతం రాజశేఖర్ ఎమ్ఎల్‌వీ నిర్మాణంలో తన తాజా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు మొదట నీలకంఠ దర్శకత్వ బాధ్యతలు చేపట్టినా కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకున్నాడు. ప్రస్తుతం మరో దర్శకుడి కోసం చిత్ర యూనిట్ వెతుకుతోంది. ఇదిలా ఉంటే ఈ రోజు రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు శేఖర్ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో రాజశేఖర్ సగం ముఖం కనిపిస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్ అయిన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అతడి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి రాజశేఖర్ అభిమానులను అనుకున్నంతగా అలరిస్తాడో లేదో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa