స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్ అయింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు... బన్నీ ముద్దుల కూతురు అర్హ. కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియా లక్షలాది లైక్స్‌తో సంచలనం అయింది.బన్నీ తన కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలను ఓ ఫోటోగ్రాఫర్ ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు. ఈ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న బన్నీ 'కుమార్తెకు ఆమె తండ్రి మొదటి ప్రేమికుడు. చిరకాల హీరో' అనే క్యాప్షన్ పెట్టారు.అల్లు అర్జున్-అర్హ ఏ తండ్రికైనా కూతురే యువరాణి. వారు ఎదుగుతున్న క్షణాలను చూస్తున్నపుడు తండ్రి పొందే ఆనందం వెలకట్టలేనిది. అలాంటి ఆనందమే ఈ ఫోటోలో బన్నీ మొహంలో కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa