ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పుడు అందరిని ఎక్కువగా ఆకర్షిస్తోన్న బ్యూటీ ఈషా రెబ్బా

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 03, 2018, 02:50 PM

టాలీవుడ్ ఆడియెన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కొంత మంది దర్శకనిర్మాతలకు బాగా తెలుసు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే మాస్ ఆడియెన్స్ కి నచ్చినట్టే అని సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో మొన్నటి వరకు అందరు ఒకేలా ఆలోచించే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఆలోచనలు మారాయి. నార్త్ బామాలను ఇష్టపడే ఆడియెన్స్ కి తెలుగమ్మాయిలు కూడా నచ్చుతున్నారు.


సావిత్రి - షావుకారు జానకి - జమున - కృష్ణా కుమారి వంటి హీరోయిన్స్ మొదట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఉన్నారు. పరభాషాలో కూడా వారు అభిమానులను బాగానే ఆకర్షించారు. ఇక భానుమతి - జయప్రద - విజయశాంతి - రాశి వంటి వారు కూడా ఆ ట్రాక్ ని అలానే కొనసాగించారు. అయితే ఆ మధ్య నుంచి నార్త్ భామల డామినేషన్ బాగా ఎక్కువగా అవ్వడంతో తెలుగమ్మాయిలు తగ్గిపోయారు. ఇక ఇప్పుడు అందరిని ఎక్కువగా ఆకర్షిస్తోన్న బ్యూటీ ఈషా రెబ్బా. ఇప్పుడిప్పుడే అమ్మడికి మంచి రెస్పాన్స్ అందుతోంది. గ్లామర్ రోల్స్ ని ఎక్కువగా టచ్ చేయకుండా కేవలం కథలో క్యారెక్టర్ బలంగా ఉంటేనే ఒకే చేస్తున్నారు. రీసెంట్ గా ఈషా అ! సినిమాలో డిఫెరెంట్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఆమె సింపుల్ నటన సినిమాలో హైలెట్ గా నిలిచింది. నెక్స్ట్ కూడా అలాంటి మంచి కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అంటోంది. నారా రోహిత్ సరసన వెంకటేష్ అండ్ తేజ మూవీలో ఎంపికైంది. 


 


ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు ఆమె గురించి ఇంకా చాలా రూమర్లు వస్తున్నాయి. 'మాయా మాల్' సినిమాలో తన కో-స్టార్ అయిన హీరో దిలీప్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోందని ఇప్పుడు టాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ విషయంలో నిజమెంతో తెలియదు కాని.. అటు ఆఫర్లు ఇటు రూమర్లు అన్నట్లు 'అ!' సుందరి భలే ఆకర్షిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa