ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ ఎందుకు రాలేకపోయాడంటే

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 11:12 AM

తెలుగు వాళ్లతోపాటు మొత్తం భారతదేశం గర్వించదగిన నటి శ్రీదేవి. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆమె అభిమానులందరినీ కలిచివేసింది. తెలుగు సినిమాల్లో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా నటించిన శ్రీదేవితో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టాలీవుడ్ తాజాగా సంతాప సభ నిర్వహించింది.


ఈ సభకు ఇండస్ట్రీలోని చాలామందే హాజరై శ్రీదేవి పట్ల తమకున్న గౌరవాన్ని.. ఆమెతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.  ఆమెతో జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి ఆల్ టైం హిట్ చిత్రంలో హీరోగా చేసిన మెగాస్టార్ ఈ సభకు రాకపోవడం కాస్త లోటుగానే అనిపించింది. దీనిపై మెగా స్టార్ బావ... నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ‘‘చిరంజీవి ఈ ప్రోగ్రాం ఉందని తెలియడానికి ముందే వేరే ఊరికి వెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అక్కడి నుంచే మన కుటుంబం తరఫున సానుభూతి తెలియజేయమని కోరారు. శ్రీదేవి అంత్యక్రియలకు హాజరైనా ఇండస్ట్రీ తరఫున జరుగుతున్న సమావేశానికి రాలేకపోవడం బాధ కలిగించిందని’’ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. 


రాజకీయాలకు పూర్తిగా దూరంగా వచ్చేసిన చిరంజీవి ఈమధ్య ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అటెండవుతూనే వచ్చారు. అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమానికి రాకపోవడం లోటే అయినా మొత్తానికి అల్లు అరవింద్ నోట తన మాట మాత్రం వినిపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa