ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్నీ లియోన్‌కు కవల పిల్లలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 02:07 PM

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మరో ఇద్దరు పిల్లలకు అమ్మయింది. గతేడాది మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ, వెబర్ దంపతులు.. ఇప్పుడు ఇద్దరు కవల మగ పిల్లలను తమ ఫ్యామిలీలోకి వెల్‌కమ్ చెప్పారు. ఇది గాడ్స్ ప్లాన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ చెప్పింది. ఇంత తక్కువ టైమ్‌లో మా కుటుంబంలోకి ముగ్గురు పిల్లలు రావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్‌లతో మా కుటుంబం పరిపూర్ణమైంది. మా ఈ ఇద్దరు కవల పిల్లలు కొన్ని వారాల కిందటే జన్మించారు. దేవుడు మాకు పెద్ద కుటుంబాన్నిచ్చాడు అంటూ సన్నీ తెగ మురిసిపోయింది. అటు ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేశాడు. గతేడాది జులైలో నిషా అనే ఓ చిన్నారిని ఈ కపుల్ దత్తతకు తీసుకుంది. అయితే ఈ పిల్ల‌లు ఎవ‌రు, ఎలా వ‌చ్చారు అన్న అంశంపై మొద‌ట్లో గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌టంతో స‌న్నీ స్పందించింది. ఆ పిల్ల‌లు స‌రోగ‌సీ ద్వారా జ‌న్మించిన‌ట్లు స‌న్నీ ట్విట్ట‌ర్‌లో చెప్పింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa