ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ సినిమాకు హీరోయిన్ సెట్టైంది

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 12:54 PM

ఇటీవలే ‘టచ్ చేసి చూడు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన మాస్ మహారాజ రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ‘అమర్ అక్బర్ అంటొనీ’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఈరోజే పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది.


ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో నటుడు సునీల్ ఒక కీలకమైన ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నాడు. ఎక్కువ భాగం చిత్రీకరణ యూఎస్లో జరుపుకోనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందివ్వనున్నాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa