తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 12నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో వెంకటేశ్ కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపిస్తుండగా.. అందుకోసం బాగా మేకోవర్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.ఇక ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన శ్రియ నటిస్తుండగా 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సురేశ్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa