రక్షకభటుడు సినిమా తర్వాత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో బృందావనమది అందరిది చిత్రంలో రిచాపనయ్ నటిస్తుంది. కామిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో తన పాత్ర గురించి రిచా పనయ్ కొన్ని విషయాలను తెలియజేసింది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో విలేజ్ అమ్మాయి లేదా గ్లామర్ పాత్రల్లోనే నటించాను. అయితే ఇప్పుడు చేస్తోన్న పాత్ర వీటికి భిన్నంగా ఉంటుంది. ఓ యాడ్ ఏజెన్సీ ఓనర్ పాత్రలో కనపడతాను. కాబట్టి ట్రెడిషనల్, వెస్ట్రన్ లుక్స్‌లో కనపడతాను. అంతే కాకుండా సినిమా మధ్యలో పాత్ర డిఫరెంట్ షేడ్‌లోకి మారుతుంది. తప్పకుండా తెలుగులో నాకు ఈ సినిమా ఓ మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది రిచాపనయ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa