ఎవరెన్ని అనుకున్నా తామంతా ఒకటే అంటారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు ఆ కుటుంబంలోని యంగ్‌స్టార్. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత పుట్టినరోజు వేడుకలు ఇటీవల జరగగా.. ఆ ఫంక్షన్‌కు ఇటు మెగా, అటు అల్లు కుటుంబంలోని యంగ్‌స్టార్స్ అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో రామ్ చరణ్, ఉపాసన మినహా అందరూ ఉన్నారు. కాగా.. రాజమౌళి చిత్రం టెస్ట్‌కట్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa