ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్ర‌మ్ త‌న‌యుడి స‌ర‌స‌న గౌత‌మి కూతురు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 10:26 AM

తెలుగులో ప‌లు వివాదాల న‌డుమ విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రానికి ల‌భించిన ఆద‌ర‌ణ‌ని చూసి ప్ర‌స్తుతం వేరే భాష‌ల‌లో రీమేక్ చేస్తున్నారు. త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల అర్జున్ రెడ్డి చిత్రాన్ని వ‌ర్మ టైటిల్‌తో రూపొందిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో అభిమానుల‌లో అనేక ఊహాగానాలు త‌లెత్తుతున్నాయి. అల‌నాటి హీరోయిన్ గౌత‌మి కూతురు సుబ్బ‌ల‌క్ష్మీ , ధృవ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని కోలీవుడ్ టాక్‌. గౌత‌మి మొద‌టి భ‌ర్త వ‌ల‌న క‌లిగిన సంతానం సుబ్బల‌క్ష్మీ కాగా, ఎప్ప‌టి నుండో త‌న కూతురిని కథానాయికగా చేయాల‌ని గౌత‌మి ప్ర‌య‌త్నిస్తుంది. ఈ క్ర‌మంలోనే సుబ్భ‌ల‌క్ష్మీ వెండితెర ఎంట్రీకి వ‌ర్మ చిత్రంతో మార్గం సుగమం చేసింద‌ని చెబుతున్నారు. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. వ‌ర్మ చిత్రం రెండో షెడ్యైల్ చెన్నైలోనే జ‌రుగుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ షెడ్యూల్‌లో సుబ్బ‌ల‌క్ష్మీ టీంతో జాయిన్ కానుంద‌ని టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa